వరుసగా 16వ సారి ఏఎంసీ స్టేట్ ఛాంపియన్

వరుసగా 16వ సారి ఏఎంసీ స్టేట్ ఛాంపియన్

VSP: కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో జరిగిన రాష్ట్ర స్థాయి మెడికల్ అథ్లెటిక్స్ మీట్‌లో విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజీ ఘన విజయం సాధించింది. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఏఎంసీ వరుసగా 16వ సారి ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించింది. పురుషుల విభాగంలో 66, మహిళల విభాగంలో 48 పాయింట్లతో మొత్తం 114 పాయింట్లు సాధించింది.