పెద్దకోరుకొండిలో సర్పంచి అభ్యర్థిగా నామినేషన్
KMM: కల్లూరు మండలంలోని పెద్దకోరుకొండి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా మాదిరాజు శైలజ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె గ్రామస్థులతో కలిసి ర్యాలీగా వెళ్లి ఎన్నికల అధికారులకు పత్రాలను సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని శైలజ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాగం ప్రభాకర్ చౌదరి ఉన్నారు.