'జల్ సంజయ్ జన్ భాగిదారీలో జిల్లాకు జాతీయ అవార్డు'
NLG: జల్ సంజయ్ జన్ భాగిదారీలో రాష్ట్రంలో నల్గొండ జిల్లా తొలి స్థానంలో నిలిచింది. జల సంరక్షణలో ఆదర్శంగా నిలిచినందుకు కేంద్ర ప్రభుత్వం నల్గొండకు జాతీయ అవార్డును ప్రకటించింది. ఇది జిల్లాకు వచ్చిన మొదటి అవార్డు కావడం విశేషం. కాగా కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవతో ఈ విజయం సాధ్యమైందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఈ అవార్డ్‌కు గానూ.. రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహకం లభించనుంది.