తహసీల్దార్‌ను కలిసిన వైసీపీ నేతలు
ASR: నూతనంగా భాద్యతలు స్వీకరించిన యటపాక మండల ఎంపీడీవో విజయ్‌దత్, ఇటీవల విధులు చేపట్టిన తహసీల్దార్ శ్రీనివాస్‌లను మండల వైసీపీ నేతలు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.