నిజాంసాగర్ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత
KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి రెండు వరద గేట్ల ద్వారా 9,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈ సాకేత్ శనివారం తెలిపారు. అంతకుముందు 2,500 క్యూసెక్కుల నీటిని తగ్గించినట్లు, ఇప్పుడు యథావిధిగా పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. నిజాంసాగర్ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.