నూతన సంవత్సర క్యాలెండర్లు ఆవిష్కరించిన కమిటీ సభ్యులు
CTR: పుంగనూరు పట్టణం ఈస్ట్ పేట లోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం నూతన సంవత్సరం క్యాలెండర్లను ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు క్యాలెండర్లను ఉచితంగా అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది భక్తులకు ఉచితంగా క్యాలెండర్లను పంపిణీ చేస్తున్నట్లు కమిటీ సభ్యులు వెంకటేష్ తెలిపారు.