ఆపరేషన్ సింధూర్ 2.0 కోసం ఎదురు చూస్తున్నాం: BSF
ఆపరేషన్ సింధూర్ 2.0 కోసం తాము సిద్ధంగా ఉన్నామని BSF సంచలన ప్రకటన చేసింది. సింధూర్ టైంలో 118 పాక్ పోస్టులను, బహుళ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఫలితంగా భారత్ కొట్టిన దెబ్బ నుంచి పాక్ ఇంకా కోలుకోలేదని ఎద్దేవా చేసింది. దీంతో భారత్ సరిహద్దులో ఉన్న 72 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను బార్డర్ నుండి చాలా దూరంగా తీసుకెళ్లిందని చెప్పింది.