CM రేవంత్ పై ఫైర్ అయిన BRS నేత ఒంటెద్దు

SRPT: మఠంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో BRS రాష్ట్ర నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా రేవంత్ అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అప్పు రేవంత్ 20 నెలల్లో చేశారని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ, భరోసా పూర్తిగా ఇవ్వలేదన్నారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు.