వరద ప్రభావిత గ్రామాలలో నిత్యవసర సరుకుల పంపిణీ
ASF: ఆసిఫాబాద్ మండలం మాలన్ గొంది గ్రామంలో నెస్టిల్ స్వచ్ఛంద సంస్థ వరద ప్రభావిత గ్రామాలలో 14 రకాల నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో MLA కోవ లక్ష్మి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే గురువారం పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. జిల్లాలోని మారుమూల ప్రాంతాల గిరిజనులకు సేవలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.