స్కూల్ డైరెక్టర్‌పై కేసు నమోదు..!
GNTR: పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో లాలాపేటకు చెందిన మహమ్మద్ అబ్దుల్ ఫయాజ్ ఫిర్యాదు చేశారు. బృందావన్ గార్డెన్స్‌లోని ఒక స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న తన కుమారుడు మహమ్మద్ సైఫ్ అహ్మద్ స్కూల్‌కు ఆలస్యంగా వచ్చాడని డైరెక్టర్ విజయ భాస్కర్ రెడ్డి కొట్టారని ఆరోపించారు. ఈ సంఘటనతో బాలుడి ముఖం వాచిపోవడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.