కేఏ పాల్‌కు హైకోర్టు ఝలక్!

కేఏ పాల్‌కు హైకోర్టు ఝలక్!

AP: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ.. ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిల్‌పై నిన్న హైకోర్టు విచారణ జరిపింది. అయితే, విచారణకు ముందు రూ. 5 లక్షలు కట్టాలని పాల్‌ను ఆదేశించింది. ఈ మొత్తాన్ని జమ చేసిన తర్వాతే తదుపరి విచారణ ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా వేసింది.