'రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అలవర్చుకోవాలి'

TPT: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం సాగు చేయాలని గూడూరు ఎమ్మెల్యే పి.సునీల్ కుమార్ రైతులకు సూచించారు. శనివారం గూడూరులో ఆయన 19 లక్షల రూపాయలు విలువచేసే రెండు డ్రోన్లను సబ్సిడీపై రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి అని అందుకోసమే రైతుల ఆధునిక వ్యవసాయ పద్ధతుల అవలంబించడం కోసం డ్రోన్లను అందించడం జరుగుతుందన్నారు.