నేడు కలెక్టరేట్లో PGRS
అన్నమయ్య జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం ఉదయం 10 గంటలకు రాయచోటిలోని కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిల్లోనూ ఈ వేదికలు ఏర్పాటు చేయబడతాయన్నారు. స్థానిక స్థాయిలో పరిష్కారం కాని సమస్యలకే జిల్లా కేంద్ర వేదికలో అర్జీలు సమర్పించాలని ఆయన సూచించారు.