లోక్ అదాలత్‌లో 714 కేసులు పరిష్కారం

GNTR: తెనాలిలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 714 కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో 56 సివిల్ కేసులు, 656 క్రిమినల్ కేసులు, 2 ప్రీ లిటిగేషన్ కేసులు ఉన్నాయి. ఈ పరిష్కారాల ద్వారా బాధితులకు రూ.5,57,68,50లు చెల్లించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు డి.శ్రీనివాసులు, ఎం.శ్రీధర్, షేక్ అబ్దుల్ షరీఫ్, పి.రాజశేఖర్ పాల్గొన్నారు.