మండల ప్రజలకు ఎస్సై హెచ్చరిక
VKB: ఎన్నికల సమయంలో శాంతి భద్రతల కోసం గ్రామాలలోని ప్రజలందరూ సహకరించాలని ఎస్సై విమల విజ్ఞప్తి చేశారు. ఆమె మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదికల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోస్టులు, వీడియోలు పెడితే కఠినమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా ఎన్నికలు జరుపుకోవాలని కోరారు.