‘జాతీయస్థాయి పోటీల్లో పేరు నిలబెట్టాలి'
NRML: జాతీయ స్థాయి వుషూ పోటీలలో నిర్మల్ జిల్లా పేరును జాతీయస్థాయిలో నిలబెట్టాలని జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి, డీఈవో భోజన్న అన్నారు. ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో నిర్వహించే 9వ జాతీయస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు నిర్మల్ జిల్లా నుంచి 12 మంది క్రీడాకారులు వెళ్లారు. జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని అభినందించారు.