కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు

కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు

BPT: నిజాంపట్నం మండల కేంద్రంలోని ఉన్న కన్యకా పరమేశ్వరి ఆలయంలో జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గణపతి, మహాలక్ష్మి అమ్మవార్లకు పూజలు చేసి ఉత్సవాలు ప్రారంభించారు. పాండురంగస్వామి ఆలయ ప్రాంగణంలో జెండా ఆవిష్కరించారు. వాసవీ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.