నేడు అయ్యప్ప ఆలయంలో మహా సంప్రోక్షణ

నేడు అయ్యప్ప ఆలయంలో మహా సంప్రోక్షణ

TPT: గూడూరు పట్టణానికి సమీపంలో ఉన్న కాశీ లేఅవుట్‌లో నిర్మించిన అయ్యప్ప ఆలయంలో శనివారం తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నూతన ధ్వజస్తంభ, విమానశిఖర, మహా సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అయ్యప్ప ఆలయంలో వారు మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణంలో ఎంతో మంది దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించి పూర్తి చేశారని చెప్పారు.