ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు.. తొలగించాలని రైతుల విన్నపం

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు.. తొలగించాలని రైతుల విన్నపం

ఆదిలాబాద్: ఇటీవల ఈదురు గాలులతో కూడిన వర్షాలకు ముధోల్ మండల కేంద్రంలోని వ్యవసాయ చేనులో ఉన్న విద్యుత్ స్తంభాలు ఒకవైపు వంగి ప్రమాదకరంగా మారాయి. వర్షాకాలం సమీపిస్తుండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. విద్యుత్ తీగలు చేతికి తగిలే ఎత్తులో ఉండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని రైతులు భయాందోళన గురవుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.