అల్పపీడనం.. భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వల్ల అనేక ప్రాంతాలు, రహదారులు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో 15 జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. వెంటనే NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.