YCP కార్యకర్త హరినాథ రెడ్డి కుటుంబానికి పెద్దిరెడ్డి పరామర్శ

YCP కార్యకర్త హరినాథ రెడ్డి కుటుంబానికి పెద్దిరెడ్డి పరామర్శ

CTR: సదుం మండలంలోని తాటిగుంటపాలెంకు చెందిన వైసీపీ కార్యకర్త హరినాథ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులను పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి పార్టీ కన్వీనర్ రెడ్డప్పరెడ్డి, ధనుంజయ రెడ్డి పాల్గొన్నారు.