ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ELR: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రజల నలుమూలల నుండి వచ్చిన వివిధ పిర్యాదిదారుల నుండి ఎస్పీ ప్రతాప్ కిషోర్ పలు ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరచే దిశగా ప్రజా సమస్యల పరిష్కార వేదికను క్రమం తప్పకుండా నిర్వహిస్తామని తెలిపారు. బాధితులకు పోలీసు శాఖ అండగా ఉంటుందన్నారు.