ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తంగిరాల

NTR: చందర్లపాడు మండలం కోనాయపాలెంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ వైద్య శిబిరం ద్వారా అనేకమంది ప్రజలు ఉచితంగా వైద్య పరీక్షలు, సలహాలు, చికిత్స పొందే అవకాశం కలుగుతుందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో ఆరోగ్య స్పృహను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.