VIDEO: రోడ్ల నాణ్యతలో రాజీ పడద్దు: ఎమ్మెల్యే
ఎన్టీఆర్: జగ్గయ్యపేట 29వ వార్డులో రోడ్డు పనులను ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ మున్సిపల్ ఛైర్మన్ రాఘవేంద్రతో కలిసి గురువారం పరిశీలించారు. రోడ్డు నాణ్యతపై రాజీపడొద్దని అధికారులకు సూచించారు. ప్రజలతో మాట్లాడి డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, ఖాళీ స్థలాల సమస్యలు తెలుసుకున్నారు. డ్రైన్లు, ఖాళీ స్థలాలపై వెంటనే చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.