గొర్రెల మందపై దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి
GNTR: మేడికొండూరు మండలం భీమినేనివారిపాలెంలో గొర్రెల మందపై కారు దూసుకెళ్లిన ఘటన సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండకు చెందిన షేక్ అబ్దుల్ అనే వ్యక్తి కారు నడుపుతూ నిద్రమత్తులో గొర్రెల మందపైకి దూసుకెళ్లాడు. ఘటనలో గొర్రెల కాపరి శ్రీను (43) అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.