రామవరంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

తూ.గో: పేదవాడి సొంతింటి కల సాకారం చేసిన ఘనత సీఎం జగన్ దక్కుతుందని ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరంలో 389మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 99శాతం జగన్ అధికారంలోకి వచ్చాక నెరవేర్చారన్నారు. అన్ని వర్గాలకు సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు.