'TB రహిత జిల్లాగా సిరిసిల్లని తీర్చిదిద్దాలి'

'TB రహిత జిల్లాగా సిరిసిల్లని తీర్చిదిద్దాలి'

SRCL: టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. ప్రపంచ టీబీ నివారణ దినోత్సవాన్ని బోయినపల్లి మండలం కొదురుపాక పీహెచ్‌సీలో మంగళవారం నిర్వహించగా, కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా 15 మంది టీబీ బాధితులకు పోషకాహార కిట్లు, పంపిణీ చేశారు.