బుడంపాడు ఫ్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

బుడంపాడు ఫ్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

GNTR: శివారు బుడంపాడు ఫ్లైఓవర్‌పై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న కారు అదుపుతప్పి క్రింద పడింది. కారులో ఉన్న యడ్లపాడు మండలం సొలస గ్రామానికి చెందిన కొండపోగు అమ్మరావు(32) మృతి చెందాడు. మరొక ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని చికిత్స కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.