'వన మహోత్సవానికి శాఖల వారీ లక్ష్యాలు నిర్ణయించాలి'

'వన మహోత్సవానికి శాఖల వారీ లక్ష్యాలు నిర్ణయించాలి'

NRML: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు అన్ని శాఖలు ఇప్పటి నుంచే లక్ష్యాలు నిర్ణయించుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో అటవీ, పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. గతంలో నాటిన మొక్కల వివరాలను సమీక్షించి, ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటాలన్నారు.