రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

MDK: కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. కౌడిపల్లి మండలం తునికి గ్రామానికి చెందిన కొన్యాల దత్తు(50) వెంకట్రావుపేట గేటు వద్ద రోడ్డు దాటుతుండగా ఓ వ్యాన్ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దత్తును ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.