వ్యక్తి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
HYD: అంబర్‌పేట్‌లో జరిగిన వ్యాపారవేత్త శ్యామ్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి తగాదాలు, ఇతర విభేదాల కారణంగా శ్యామ్ మొదటి భార్య మాధవిలత ఈ కిడ్నాప్‌ను సుపారీ గ్యాంగ్‌తో చేయించినట్లు తేలిందన్నారు. ఫాతిమా అనే మహిళను శ్యామ్ రెండో వివాహం చేసుకోవడం కూడా ఇందుకు కారణమైందన్నారు. మొదటి భార్య మాధవిలతతో సహా మొత్తం 10 మందిని పోలీసులు అరెస్టు చేశారన్నారు.