చిత్తూరు-తిరుపతి హైవేపై ప్రమాదం

చిత్తూరు-తిరుపతి హైవేపై ప్రమాదం

చిత్తూరు: పట్టణంలోని తిరుపతి హైవేపై ఆర్వీఎస్ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూటీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను వెజ్జుపల్లి గ్రామానికి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు.