'పశువులకు తప్పనిసరి టీకాలు వేయించాలి'

'పశువులకు తప్పనిసరి టీకాలు వేయించాలి'

NLG: గుడిపల్లి మండల కేంద్రంలో గాలికుంటు వ్యాధి టీకాల పంపిణీని సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. గాలికుంటు వ్యాధి పశువులకు సోకే అత్యంత ప్రమాదకరమైన వైరస్ వ్యాధి అని అన్నారు. ఈ వ్యాధి నివారణకు టీకాలు వేయించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. గుడిపల్లి పరిధిలోని పాడి రైతులు తమ పశువులకు తప్పనిసరి టీకాలు వేయించుకోవాలని సూచించారు.