మున్సిపల్ హైస్కూల్‌ను పరిశీలించిన మంత్రి నారాయణ

NLR: నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ హైస్కూల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం ఉదయం మూలపేటలోని ఏనుగు సుందరరామిరెడ్డి నగరపాలక ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. స్కూల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కమిషనర్ నందన్‌తో చర్చించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు.