అయోధ్య రామయ్య సన్నిధిలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్యను సందర్శించనున్నారు. మూడు రోజుల యూపీ పర్యటనలో భాగంగా ఆమె రామ్ లల్లాను దర్శించుకుని, ఆలయ రెండో అంతస్తులో 'శ్రీరామ యంత్ర' స్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. చైత్ర నవరాత్రి(ఉగాది) ప్రారంభం సందర్భంగా ప్రత్యేక పూజలు జరగనున్నాయి. అనంతరం ఆమె మథుర, బృందావనం వెళ్తారు. ఆలయ నిర్మాణ కార్మికులను కూడా రాష్ట్రపతి సన్మానిస్తారు.