బంకుల వద్ద బారులు తీరిన కార్లు
HYD: నగరంలో LPG, CNG ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనదారులు గ్యాస్ కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఈ మేరకు నగరంలోని పలు ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద ఆటోలు, కార్లు భారీగా క్యూ కట్టాయి. గ్యాస్ కొరత కారణంగా ఫిల్లింగ్ స్టేషన్లలో LPG, CNG రేట్లు పెంచేస్తున్నారని వాహనదారలు ఆరోపిస్తున్నారు. కాగా, పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే.