VIDEO: మరుగుదొడ్లు లేక మహిళలకు ఇబ్బందులు

ELR: నూజివీడు పట్టణంలో పల్లె నుంచి వచ్చే మహిళలకు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని నూజివీడు బీజేపీ పట్టణ అధ్యక్షురాలు నాగమణి అన్నారు. ఈ మేరకు సోమవారం స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్‌కు బీజేపీ నాయకులు వినతి పత్రం అందించారు. పట్టణంలో రోజువారిగా 75, 000 మంది జనాభా రాకపోకలు సాగిస్తున్నారని ఆమె చెప్పారు. అధికారులు వెంటనే స్పందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.