దేవినేని ఉమాని కలిసిన టీడీపీ నాయకులు
ఎన్టీఆర్: విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి టీడీపీ కార్యాలయంలో గురువారం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును, కంచికచర్ల ఏఎంసీ ఛైర్మన్ కోగంటి బాబు, టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వరుసగా మూడోసారి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.