పరిశుభ్రతే ఆరోగ్యానికి పునాది: జేసీ
VSP: విశాఖపట్నం కలెక్టరేట్‌లో ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి పాల్గొని పరిసరాలను శుభ్రపరిచారు. అధికారులతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలని, అప్పుడు మాత్రమే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.