ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
ASF: సోదర భావానికి ప్రతీక రంజాన్ అని ఎమ్మెల్యే కోవలక్ష్మీ, కలెక్టర్ హరిత అన్నారు. గురువారం రాత్రి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, సహనం, పరస్పర సహకారం, సామాజిక ఐక్యతకు ప్రతీక అన్నారు.