గ్రామాల వారిగా పోలింగ్ సామాగ్రి పంపిణీ
NRML: రేపు నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో దిలావర్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆయా గ్రామాలకు సంబంధించిన ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా మండల అధికారులు సూచించారు. ఎంపీడీవో అరుణ రాణి, ఎంపీవో గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు