VIDEO: నీట మునిగిన గాయత్రి నగర్ కాలనీ

VIDEO: నీట మునిగిన గాయత్రి నగర్ కాలనీ

MDK: తూప్రాన్ గాయత్రి నగర్ కాలనీ వర్షానికి జలమయమైంది. కాలనీ నీట మునగడంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. కాలనీకి చెందిన విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలను కొందరు టిప్పర్ సహాయంతో బయటకు తీసుకువచ్చారు. సోమవారం రాత్రి వరకు సైతం నీరు తగ్గకపోవడంతో మహిళలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. పురుషులు బయటకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకున్నారు.