మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
ఏలూరులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన స్థానిక బీడీ కాలనీకి చెందిన బొంతు దుర్గాప్రసాద్, షేక్ అహ్మద్, చిట్టి ఆంజనేయులు భౌతిక కాయాలను టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చెంతే మంగళవారం సందర్శించారు. ఏలూరులోని ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద ఉంచిన వారి మృతదేహాలకు ఎమ్మెల్యే నివాళులర్పించారు. వారికి ఆర్థిక సాయం చేశారు.