పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి: ఎంపీ
కృష్ణా: గుడివాడలో జనసేన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ.. జనసేన ఉద్యమి సభ్యత్వాలు భారీ సంఖ్యలో చేసి, జనసేన కార్యకర్తల కుటుంబాలకు భరోసా నింపాలన్నారు. గుడివాడలో బూరగడ్డ శ్రీకాంత్ నాయకత్వంలో జనసేన బలంగా ఉందని, రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు.