కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ప్రజా దర్బార్
ప్రకాశం: కనిగిరిలోని అమరావతి గ్రౌండ్ నందు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించి సంబంధిత శాఖ అధికారులకు అందజేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ప్రజా దర్బార్ కార్యక్రమం కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.