VIDEO: ఆలయంలో చోరీకి పాల్పడ్డ నిందితులు అరెస్ట్
ప్రకాశం: అక్టోబర్ 23వ తేదీన గిద్దలూరు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి పాల్పడ్డ ముగ్గురు దొంగలను గిద్దలూరు పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 8 కేజీల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.