ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం.. రోగులు ఇబ్బంది
BHPL: జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం రోగులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. రక్త పరీక్షల కౌంటర్ ఒక్కటే ఉండటంతో పురుషులు, మహిళలు, గర్భిణీలు గంటల తరబడి ఒకే క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఈ విషయంపై సిబ్బందిని ప్రశ్నిస్తే "సిస్టమ్లు పాడైపోయాయి" అని బాధ్యతారాహిత్యంగా సమాధానమిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.