ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు
ATP: గుత్తిలో శ్రీ సూర్యవంశం ఒడియా రాజుల సంఘం ఆధ్వర్యంలో గురువారం శ్రీ భగీరథ మహర్షి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సంఘం నాయకులు చిరంజీవి, మారుతి ప్రసాద్, లక్ష్మీదేవి మాట్లాడుతూ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భగీరథుని కృషి (భగీరథ ప్రయత్నం)నేటి తరానికి, ముఖ్యంగా యువతకు ఆదర్శమని తెలిపారు.