26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!

26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!

చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 26 బంతుల్లోనే తన అర్ధసెంచరీని పూర్తి చేసి జట్టును విజయతీరాలకు చేరుస్తున్నాడు. ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం పంజాబ్ గెలుపు ముంగిట నిలిచింది.