రోడ్లపై నాట్లు వేస్తూ మహిళల నిరసన

KMM: రూరల్ మండలం తీర్థాల నుంచి పోలిశెట్టిగూడెం మద్దివారిగూడెంకు, వెళ్లే ప్రధాన రహదారి డాక్యాతండా వద్ద రోడ్డు పూర్తిగా దెబ్బతింది. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గుంటలుగా మారి వరద నీరు వచ్చి చేరడంతో బురదమయంగా మారింది. గ్రామ రోడ్డు పరిస్థితి మరింత దారుణంగా తయారవడంతో స్థానిక గిరిజన మహిళలు రహదారిపై వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు.